బ్లాగు పరిచయం

అభినయం వేరు. సౌందర్యం వేరు. రెండూ కలిసే ఉండాలన్న నియమం లేకున్నా మొదటి నుంచీ  వెండి తెర రెండింటి కలయికకే ప్రాధాన్యం ఇచ్చింది. అందుకే ఆది నుంచీ అందగాళ్ళు, అందగత్తెలే  సినీ రంగాన్ని ఏలుతూ వచ్చారు. ముఖ్యంగా ప్రేక్షకుల కలల ప్రపంచంలో సినీ కథానాయికలకు ఉన్న స్థానం అంతా ఇంతా కాదు. అభినయంతో పాటు అందమైన ఆనందాన్ని పంచిన, పంచుతున్న సినిమా నటీమణుల గురించి మాట్లాడేందుకే ఈ బ్లాగు. 

బ్లాగులో పేజీల గురించి :

తొలి కథానాయిక 
ఈ పేజీలో తెలుగు చలన చిత్ర పుట్టుక, తొలితరం కథానాయికల పరిచయం ఉంటుంది. ఒక రకంగా బ్లాగుకు ఉపోద్ఘాతం అన్నమాట.   
చిత్ర సౌందర్యం 
ఈ పేజీలో తెలుగు చలన చిత్ర కథానాయికల అభినయ సౌందర్యాన్ని తెలిపే ఫోటోలు ఉంటాయి. ఇక్కడ నటీమణుల హావభావాల ప్రకటన తీరును చూడొచ్చు.   

వేడుకలు 
తెలుగు చలన చిత్ర కథానాయికలు ఆడియో ఫంక్షన్లకు, అవార్డు ఫంక్షన్లకు, ప్రమోషన్ లకు వెళ్తుంటారు. ఆయా సందర్భాలలో వారికి సంబంధించిన ఫోటోలు ఈ పేజీలో ఉంటాయి.   
   
ఫ్యాషన్ 
చలన చిత్రాల్లో నటించడమే కాకుండా కొందరు నటీమణులు ఫ్యాషన్ దుస్తులు ధరించి రాంప్ పై వయ్యారాలు ఒలకబోస్తుంటారు. వాటి తాలూకు ఫోటోలు ఇక్కడ ఉంటాయి.   

మోడలింగ్ 
మన నటీమణులు సబ్బు మొదలుకుని ఎన్నెన్నో ఉత్పత్తులకు ప్రమోటర్స్ గా వ్యవహరిస్తుంటారు. వాటి తాలూకు ఫోటోలు ఇక్కడ ఈ పేజీలో ఉంటాయి.    


వ్యక్తిగతం 
ఈ పేజీలో తారామణుల వ్యక్తిగత ఫోటోలు, సామాజిక మాధ్యమాలలో ఉంచిన ఫోటోలు, చిన్నప్పటి  జ్ఞాపకాలు వంటివి ఉంటాయి.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి